ఘనంగా బుల్లితెర నటి శ్రీవాణి ఇంటి గృహప్రవేశ వేడుక!
on Dec 10, 2022
స్మాల్ స్క్రీన్ మీద శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పక్కన సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది. మరో పక్క ఫామిలీఫామిలీ కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ తన ఫాన్స్ ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు లేటెస్ట్ తన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. శ్రీవాణి ఇంటి గృహప్రవేశ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. ఈ గృహప్రవేశ వేడుకను శ్రీవాణి ఎంతో ఘనంగా నిర్వహించారు. భర్త విక్రమాదిత్య, కూతురు నందినితో కలిసి శ్రీవాణి స్వామి వారికి పూజ చేసి వంటగదిలో పాలు పొంగించారు.
ఇక ఈ వేడుకలో హిమజ, జబర్దస్త్ ఫేమ్ పవిత్రతో, సుష్మకిరణ్, నవీన, అంజలితో పాటు పలువురు నటీనటులు పాల్గొనే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా శ్రీవాణికి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీవాణి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్లాగ్ లు ఎక్కువగా చేస్తుంది. వీటిల్లో తన పర్సనల్ విషయాలు, తన ఇబ్బందులు, తన చేసే షాపింగ్ లు ఇలాంటి రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
